యాప్నగరం

ఆ పాపంలో నేనూ భాగస్వామినే.. అందుకే శిక్షను అనుభవించా: స్పీకర్ తమ్మినేని

AP Assembly: అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో భాగస్వామినేనని.. తాను చేసిన తప్పుతో 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యాయనన్న స్పీకర్.

Samayam Telugu 10 Dec 2019, 12:24 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్, హాట్‌గా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాలను చేపట్టకుండా వంశీకి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై టీడీపీ మండిపడింది. వంశీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని- టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది.
Samayam Telugu tammineni


Read Also: ఏపీ అసెంబ్లీ.. వైసీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత

దీంతో చంద్రబాబు ఇదేం పార్టీ ఆఫీసు కాదు.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన స్పీకర్ తమ్మినేని ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని మండిపడ్డారు. ఆ తర్వాత స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. వల్లభనేని వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Read Also: నేను అలా ఎక్కడా అనలేదు.. సాక్షిలో తప్పు రాశారు: జగన్

వంశీ ప్రసంగం తర్వాత స్పీకర్ తమ్మనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వైసీపీ ఆఫీసన్న మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. సభపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని.. అసెంబ్లీ ఎవరికీ జాగీర్ కాదని.. ప్రజల జాగీర్‌ మాత్రమేనని అన్నారు. గతంలో సభలో ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని.. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు 15ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని తమ్మినేని అన్నారు.
Also Read: టీడీపీతో ఉండలేను.. ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వల్లభనేని వంశీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.