యాప్నగరం

ఉద్రిక్తల మధ్య ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ.. జగన్ సర్కార్ దూకుడు

YS Jagan ప్రభుత్వం రాజధాని అంశంపై అదే దూకుడు ప్రదర్శిస్తోంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచింది.

Samayam Telugu 20 Jan 2020, 12:31 pm
మరావతిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. సీఆర్డీఏ చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణపై చర్చించడానికి ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. పలు బిల్లులపై కీలక చర్చ కొనసాగుతోంది. రాజధానిపై ఏపీ కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం (జనవరి 20) ఉదయం సభలో ప్రవేశపెట్టారు.
Samayam Telugu buggana


అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. ఈ బిల్లు చరిత్రాత్మకమైందని పేర్కొన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అసెంబ్లీలో బుగ్గన వెల్లడించారు. 4 జిల్లాలకు కలిపి ఒక జోనల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఉంటుందని.. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా విశాఖ, లెజిస్లేటివ్‌ కేపిటల్‌గా అమరావతి, జ్యుడిషియల్ కేపిటల్‌గా కర్నూలు ఉంటాయి అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కావాలని.. ఇది వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని.. శ్రీకృష్ణ కమిటీ కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నట్లు చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక వాదం రాకుండా ఉండాలంటే సమానమైన అభివృద్ధి జరగాలని.. తెలంగాణ వంట అంశం తెరపైకి రాకుండా ఉండాలంటే.. రాష్ట్రంలో వికేంద్రీకరణ అవసరమన్నారు.

మరోవైపు.. ఏపీ కేబినెట్ నిర్ణయానికే తన మద్దతు అంటూ జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు.. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు, మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ వైపు దూసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.