యాప్నగరం

'గుడులకు కూడా వైసీపీ రంగులా.. పిచ్చి పరాకాష్ట బాబోయ్'

'రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది. బడిని,గుడినీ వదలని వైసీపీవాళ్ళు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉన్నారు' బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయాణ విమర్శలు.

Samayam Telugu 13 Nov 2019, 11:09 am
వైఎస్సార్‌సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలతో పాటూ ప్రజల నుంచి విమర్శలపాలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలకు వైఎస్సార్‌సీపీ రంగులు వేసే నిర్ణయంపై టీడీపీ సహా అన్ని పార్టీలు భగ్గుమన్నాయి. ఆ వివాదాన్ని పక్కన పెడితే సచివాలయాలతో పాటూ మరికొన్ని కార్యాలయాలు, గోడలు ఇలా మిగిలిన వాటికి కూడా రంగులు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Samayam Telugu kanna.


Read Also: సీఎం జగన్ ఆ రెండు ఫోటోలు మాత్రమే వాడాలి.. ఎందుకంటే!

ఇదే అంశంపై తాజాగా జగన్ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆలయాలకు కూడా వైఎస్సార్‌సీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు. అలాగే అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని.. ఇలా మతవ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. ‘రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది. బడిని,గుడినీ వదలని వైసీపీవాళ్ళు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉన్నారు. అన్నవరంలో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్లో అర్చిపై బొమ్మల ఏర్పాటు,భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయి’అన్నారు కన్నా.
‘మీ పైత్యం పాడుగాను... చివరకు దేవుళ్లనూ వదలడం లేదు గదరా... స్మశానాలు, స్తంభాలు, రోడ్డు డివైడర్లు, ప్రభుత్వ భవనాలు, బడులూ... ఇంకేం మిగిలాయిరా..? ఆ ధ్వజస్తంభాన్ని, గోపురాన్ని ఎందుకు వదిలేసినట్టు...? పూసేయండి... లేదా ప్రజలందరికీ ఆ మూడు రంగుల యూనిఫాం ఒకటి తప్పనిసరి అని చట్టం చేయండి’అంటూ మరొకరు మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.