యాప్నగరం

PM Modi కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే.. క్లారిటీ వచ్చేసింది!

Pawan Kalyan ప్రధాని మోదీ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో రకరకాలుగా ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు జరిగాయి.. దీనిపై క్లారిటీ వచ్చేసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Jul 2022, 7:25 am

ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాణ్ మోదీ కార్యక్రమానికి దూరం
  • ఓ వీడియోను విడుదల చేసిన జనసేనాని
  • సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పవన్ కళ్యాణ్
భీమవరంలో ప్రధాని నరేంద్ర (PM Modi) చేతుల మీదుగా మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ దూరంగా ఉన్నారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్‌లో ఏదేదో ప్రచారం జరిగింది. అయితే పవన్ హాజరుకాకపోవడానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విడుదల చేసిన వీడియో సందేశమే.. ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానమని వ్యాఖ్యానించారు. జనసేన శ్రేణులు ప్రధాని సభను జయప్రదం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
భీమవరం ఈ కార్యక్రమంతో రాజకీయాలకి సంబంధంలేదన్నారు సోము. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతోందని.. అందులో ఎలాంటి అనుమానం, సందేహం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని.. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదుగుతుందన్నారు. స్థానిక పార్టీలకు కుటుంబ పాలనపైనే మక్కువని, బీజేపీకి మాత్రం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు.

యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వీర్రాజు గుర్తు చేశారు. టీచర్లు, పోలీసు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాం‌నన్నారని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారని.. కానీ ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారని విమర్శించారు.

ప్రతిదీ రాజకీయ కోణంలో‌ చూడటం సరికాదన్నారు సోము. కొందరు ఉన్నట్టుండి పుట్టుకొచ్చి మేధావుల్లా మాట్లాడుతున్నారని.. వాళ్లను పట్టించుకునేది లేదన్నారు. ఎందుకంటే సబ్ కా సాత్, సబ్ కా‌ వికాస్ అనేది మోదీ మంత్రం అన్నారు. ఏపీలోని జాతీయ రహదారులు బాగున్నా.. రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ రోడ్లను బాగుచేసే బాధ్యతని యువకులకు ఇస్తామని.. మొక్కలు పెంచి,‌ సంరక్షించే పనినీ నిరుద్యోగులకే అప్పజెబుతాము అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.