యాప్నగరం

BJP vs YSRCP: జగన్ పార్టీపై వార్ మొదలెట్టిన బీజేపీ..!

బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య జాతీయ స్థాయిలో స్నేహం కొనసాగుతుండగా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా సూచనల మేరకు అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నారనే వార్త ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. బీజేపీ, వైఎస్సార్సీపీ మధ్య స్నేహ బంధం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. మూడు రాజధానుల దిశగా జగన్ సర్కారు అడుగులేస్తుండగా.. ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం వేరే, బీజేపీ వేరే అన్నట్టుగా ఉంది కమలనాథుల వైఖరి. బీజేపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మైత్రి కొనసాగుతుండగానే.. ఏపీ బీజేపీ జగన్ పార్టీపై సెటైర్లు వేసింది. File Doesn't Exist అంటూ కంప్యూటర్ ఫోల్డర్ల భాషలో విమర్శలు గుప్పించింది.

Samayam Telugu 6 Mar 2020, 2:02 pm

Samayam Telugu ap bjp starts twitter war with file does not exist tweet against ysrcp
BJP vs YSRCP: జగన్ పార్టీపై వార్ మొదలెట్టిన బీజేపీ..!

జాతీయ స్థాయిలో సత్సంబంధాలు.. రాష్ట్ర స్థాయిలో విబేధాలు!

జగన్ సర్కారు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాభివృద్ధి నిలిచిపోయిందని.. రాష్ట్రానికి కంపెనీలేవీ రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు కొనసాగింపుగా అన్నట్టుగా ఏపీ బీజేపీ విభాగం ఓ ట్వీట్ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ - వైఎస్సార్సీపీ - 150 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు - అభివృద్ధి - ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్’ అని ట్వీట్ చేసింది. సాధారణంగా కంప్యూటర్‌లో ఏదైనా డ్రైవ్‌లో ఓ ఫోల్డర్ క్రియేట్ ఆ ఫోల్డర్‌లో మరో ఫోల్డర్.. అందులో మరొకటి క్రియేట్ చేసినట్టుగా.. ఏపీ బీజేపీ ఈ ట్వీట్ చేసింది.

వెనక్కి తగ్గని వైఎస్సార్సీపీ ఫ్యాన్స్

వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ - బీజేపీ - ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని జగన్ అభిమానులు కమలం పార్టీపై రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మరొక నెటిజన్ బదులిస్తూ.. ఇండియా - బీజేపీ - 303 సీట్లు - డెవలప్‌మెంట్ - ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కౌంటర్ ఇచ్చారు. మరో నెటిజన్ అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఇటు ఏపీలో అధికారంలో వైఎస్సార్సీపీకి కలిపి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదు, అభివృద్ధి లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఒక సర్పంచ్ కూడా లేడని.. ఇటీవలి ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని వైసీపీ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

ఎంట్రీ ఇచ్చిన గోరంట్ల

ఏపీ బీజేపీ ట్వీట్ చేసిన కాసేపటికే టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే తరహా ట్వీట్‌తో వైఎస్సార్సీపీపై సెటైర్లు వేశారు. అదే ట్వీట్‌ను కాస్త అప్డేడ్ చేసిన ఆయన వైఎస్సార్సీపీ ఖాతాలో 154 మంది ఎమ్మెల్యేలను చేర్చారు. టీడీపీ నుంచి బయటకొచ్చి బాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పించిన వల్లభనేని వంశీతోపాటు జగన్‌ను కలిసిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌లను కూడా ఆయన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఖాతాలో వేశారు. అలాగే జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను కూడా బుచ్చయ్య చౌదరి జగన్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పకనే చెప్పారు. రాపాక జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలకు జైకొడుతున్న సంగతి తెలిసిందే.

బీజేపీ ట్వీట్లను కూడా కాపీ చేస్తున్నారంటూ..

కాగా బుచ్చయ్య చౌదరి ట్వీట్‌కు టీడీపీ అభిమానులు సానుకూలంగా స్పందిస్తుండగా.. బీజేపీ, వైఎస్సార్సీపీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సిస్టమ్ కరప్టడ్ అని పెట్టాల్సింది సార్ అని ఒక వ్యక్తి సలహా ఇవ్వగా.. ఏపీలో వైఎస్సార్సీపీ మినహా మిగతా పార్టీలేవీ కనిపించడం లేదని జగన్ అభిమాని ఒకరు బుచ్చయ్య చౌదరి ట్వీట్‌కు బదులిచ్చారు. ఒకప్పుడు బీజేపీ పథకాలకు టీడీపీ స్టిక్కర్లు అతికించారు. ఇప్పుడు బీజేపీ ట్వీట్లను సైతం టీడీపీ నేతలు కాపీ కొడుతున్నారంటూ బీజేపీ కార్యకర్త ఒకరు సెటైర్లు వేశారు. మొత్తానికి ‘ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్’ ట్వీట్ ఏపీలో మూడు పార్టీల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండ్ అవుతోందిలా..

గత కొద్దిరోజులుగా ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం కోసం ఈ తరహా ట్వీట్లను ఉపయోగిస్తున్నారు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సహా పలువుర్ని టార్గెట్‌గా ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను ఏపీ బీజేపీ అందిపుచ్చుకొని వైఎస్సార్సీపీపై సెటైర్లు వేసింది.

Twitter-BJP ANDHRA PRADESH

Twitter-ABHILASH Gundapaneni🇮🇳🇮🇳🇮🇳

Twitter-Govardhan Reddy R 🇮🇳

Twitter-ramu

Twitter-🇮🇳Ashok Kumar.S 🇮🇳

Twitter-Mahesh Devote💺

Twitter-🇮🇳Ashok Kumar.S 🇮🇳

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.