యాప్నగరం

అమరావతి ఉద్యమంలో చెప్పుతో కొట్టుకున్న బీజేపీ అధికార ప్రతినిధి సస్పెన్షన్

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను పార్టీ అధికార ప్రతినిధిని బీజేపీ సస్పెండ్ చేసింది.

Samayam Telugu 9 Aug 2020, 6:24 pm
ఏపీ మూడు రాజధానులపై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తోంది. ఇటీవలే మూడు రాజధానులపై ఓ పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా మరో నేతపై సస్పెండ్ వేటు పడింది. రాజధాని అమరావతికి 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల పక్షాన బీజేపీ అండగా నిలబడలేకపోతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
Samayam Telugu శనివారం అమరావతి నిరసనలో భాగంగా  చెప్పుతో కొట్టుకుంటున్న వెలగపూడి గోపాలకృష్ణ


గోపాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘రాజధాని అమరావతి సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీరు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదు. రాష్ట్ర రాజధాని సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి పాత్ర లేదని బీజేపీ అధికారికంగా తెలిపింది. కానీ పార్టీ అభిప్రాయానికి మీ ప్రకటనలు పూర్తిగా వ్యతిరేకం.

బీజేపీ రైతుల పక్షాన నిలబడటం లేదన్న మీ ఆరోపణ నిరాధారమైనది. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. అనేక వార్తాపత్రికలు, టెలివిజన్ చానెల్స్ మీ తప్పుడు ఆరోపణలకు విస్తృత ప్రచారం ఇచ్చాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం’’ అంటూ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.