యాప్నగరం

సీఎం జగన్ తాజా నిర్ణయం.. ఎమ్మెల్యే రోజాకు కొత్త ఉత్సాహం

APIIC: ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఏపీఐఐసీ మరింత క్రియాశీలంగా మారే అవకాశముందని తెలుస్తోంది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీఐఐసీ చైర్మన్ రోజాలో కొత్త ఉత్సాహం నింపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Samayam Telugu 16 Jul 2020, 9:37 pm
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్‌పర్సన్ రోజాకు కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. బుధవారం నాటి ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమని తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో ఏపీ మంత్రి వర్గం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో ఏపీఐఐసీ కార్పొరేషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ రూ.2 వేల కోట్ల రుణం తీసుకొనేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రుణానికి ఏపీ ప్రభుత్వం పూచీకత్తుగా ఉండేందుకు అంగీకరించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఏపీఐఐసీ మరింత క్రియాశీలంగా మారే అవకాశముందని తెలుస్తోంది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీఐఐసీ చైర్మన్ రోజాలో కొత్త ఉత్సాహం నింపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Samayam Telugu రోజా (ఫైల్ ఫోటో)
Roja



వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ఎమ్మెల్యే రోజాకు పేరున్న సంగతి తెలిసిందే. ఆమె తొలుత ఏపీ మంత్రివర్గంలో చోటు ఆశించారు. కానీ, చివరికి సీఎం జగన్ ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి అప్పగించారు. ఈ కార్పొరేషన్‌కు నిధులు లేవని.. అందుకే రోజా చేపట్టిన బాధ్యతలకు అంతగా ప్రాధాన్యం లేదనే ఊహాగానాలు కూడా వినిపించాయి. మరోవైపు, ఎమ్మెల్యే రోజా ఏ మాత్రం ఖాళీ దొరికినా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. జబర్దస్త్, బతుకు జట్కా బండి వంటి టీవీ షోలను చూసుకుంటూనే రాజకీయాలకు తగిన తన ప్రాధాన్యం ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.