యాప్నగరం

పవన్ కళ్యాణ్ అభిమానికి సాయం చేసిన సీఎం జగన్

పవన్ కళ్యాణ్ అభిమాని అయినే నాగేంద్ర తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అతని చికిత్సపై స్పందించిన జగన్ వెంటనే ఆర్థిక సాయం అందించారు.

Samayam Telugu 16 Aug 2020, 11:20 am
పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు అనారోగ్యంతో బాధపడతున్నాడన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. పవన్ అభిమాని అయిన నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. దీంతో కొందరు ఈ పోస్టును సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. పలువురు నెటిజన్లు సైతం దీన్ని రిట్వీట్ చేశారు. జనసేన పార్టీతో పాటు, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్లకు ట్యాగ్ చేశారు. అయితే ఈ వార్తపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు స్పందించారు. పవన్ అభిమాని అనారోగ్యానికి సంబంధించిన వార్తను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
Samayam Telugu పవన్, జగన్


దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు చికిత్స జరిగింది. అతనికి స్టెమ్ సెల్ థెరపి జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. అటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు. గూగుల్ పే నెంబర్ ఇవ్వాలని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.