యాప్నగరం

తల్లి ప్రేమను మించింది లేదు.. మదర్స్ డే పై జగన్ స్పెషల్ ట్వీట్

మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమను మించింది ఏదీ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు.

Samayam Telugu 10 May 2020, 1:09 pm
ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సినీ, రాజికీయ ప్రముఖులంతా మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సైతం మదర్స్ డే సందర్భంగా ట్వీట్ చేశారు. ‘విశ్వసనీయత, గురువు, సంరక్షకురాలు.. అన్నింటికి మించి ఆమె ప్రేరణ; జీవితకాలంలో రకరకాల పాత్రలు ధరించే గొప్ప తల్లులందరికీ చాలా మాతృదినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. తల్లి ప్రేమను మించిన ప్రేమ అనేది లేదన్నారు సీఎం. అంతకుముందు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu తల్లి విజయమ్మతో జగన్


అయితే ఈ సందర్భంగా కూడా చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం. కానీ, దురదృష్టవశాత్తు విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ బాధ నుంచి వారు త్వరగా కోలుకునే ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా మనమందరం కోరుకుందాం' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. నారా లోకేష్ కూడా ఇదే తరహాలో ట్వీట్ చేశారు. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన కొందరు తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.