యాప్నగరం

సీఎం జగన్ ఇంట విషాదం

సీఎం సతీమణి భారతి , తల్లి విజయమ్మ వెంటనే గ్రామానికి చేరుకున్నారు. గంగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యుల్ని సీఎం ఫోన్ ద్వారా పరామర్శించారు.

Samayam Telugu 6 Sep 2020, 9:50 am
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన పెద్దమామ ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి.. జగన్ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డికి పెద్దనాన్న అవుతారు. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి.. పులివెందులలోని ఓ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందారు. అయితే ఇటీవల స్వగ్రామం అయిన వేముల మండలం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు.
Samayam Telugu జగన్ పెదమామ మృతి


Read More: కరోనా బాధితులకు రూ. 2వేల సాయం తాత్కాలికంగా నిలిపివేత.. కారణం ఇదేనట!

శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో చికిత్స కోసం ఆయనను పులివెందులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. జగన్ తల్లి , వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, అలాగే సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గొల్లల గూడూరు గ్రామానికి చేరుకున్నారు. గంగిరెడ్డి భౌతికఖాయానికి నివాళులు అర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.