యాప్నగరం

వైఎస్సార్‌కు ఘన నివాళి.. సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్

బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Samayam Telugu 2 Sep 2020, 10:25 am
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి నేడు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డితో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Samayam Telugu వైఎస్‌కు నివాళి


‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


మరోవైపు వైఎస్సార్‌కు అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.