యాప్నగరం

ఏపీ కేబినెట్ విస్తరణ.. ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్, ఛాన్స్ వారికే!

ఈ రెండు మంత్రి పదవులకు ఎవరికి ఛాన్స్ దక్కతుందునేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తారా.. జిల్లాలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది చూడాలి.

Samayam Telugu 3 Jul 2020, 8:02 am
ఏపీ కేబినెట్‌లో ఖాళీ అయిన రెండు బెర్తుల భర్తీపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజ్యసభకు వెళ్లడంతో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రావణమాసంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రావణ మాసం ఈ నెల 21న నుంచి ప్రారంభమవుతుంది.. 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.
Samayam Telugu సీఎం జగన్


ఈ రెండు మంత్రి పదవులకు ఎవరికి ఛాన్స్ దక్కతుందునేది ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తారా.. జిల్లాలవారీగా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది చూడాలి. లేకపోతే సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తారా అన్నది ఆసక్తికరం. ఒకవేళ జిల్లాల వారీగా అవకాశం ఇస్తే ఎవరికి బెర్తులు దక్కుతాయన్నది ఉత్కంఠరేపుతోంది.

బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తే మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని, మరో ఒకరిద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు బీసీ కాకపోయినా ఇదే జిల్లా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా రేసులో ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి పొన్నాడ సతీష్‌తో పాటూ మరికొందరు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ సీనియార్టీకి పెద్ద పీట వేస్తే చాలామంది సీనియర్లు జాబితాలో ఉన్నారు. వారిలో కొలుసు పార్ధసారథి, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఉమ్మారెడ్డి, జోగి రమేష్ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.