యాప్నగరం

తండ్రి బాటలో సీఎం జగన్.. ఫిబ్రవరి 1 నుంచి..

తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఫిబ్రవరి నుంచి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

Samayam Telugu 24 Jan 2020, 4:01 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ నవతర్నాలు, కొత్త పథకాలపై ఫోకస్ పెట్టారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటి వరకు పథకాలు, పాలనాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టిన జగన్.. ఇక ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. తన తండ్రి బాటలో రచ్చబండ తరహాలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.
Samayam Telugu ys jagan.


రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్.. ఫిబ్రవరి నుంచి గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ పర్యటనల్లో ప్రధానంగా ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి.. పథకాల అమలు తీరు.. స్థానికంగా ఉన్న సమస్యల్ని స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఆ సమస్యల్ని పరిష్కరించడంతో పాటూ ఏవైనా హామీలు ఇస్తే.. వాటిని కచ్చితంగా అమలు చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

2009లో దివంగత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. రచ్చబండ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావించారు. చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళుతున్న సమయంలో.. కర్నూలు జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అదే బాటలో గ్రామాల పర్యటనకు సిద్ధమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.