యాప్నగరం

పాలకుడ్ని కాదు, ప్రజా సేవకుడ్ని.. జగన్ ఎమోషనల్ పోస్ట్

పాలకుడ్ని కాదు, ప్రజా సేవకుడ్ని.. మా ప్రభుత్వానికి చల్లని దీవెనలు ఉండాలి.. రాష్ట్ర ప్రగతికి వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నాను.

Samayam Telugu 30 Nov 2019, 12:19 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది మే 30న ప్రమాణస్వీకారం చేసి జగన్.. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హమీలు, ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తన పాలన ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పాలకుడ్ని కాదు, ప్రజా సేవకుడ్ని అన్నారు.
Samayam Telugu jagan.


Read Also: రాజన్న స్వర్ణయుగాన్ని జగనన్న తీసుకొచ్చారు.. ఎమ్మెల్యే రోజా

ఈ ఆరు నెలల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో ఓ వీడియోను పోస్ట్ చేశారు జగన్. యువతకు 4లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, వాహనమిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ఇలా ఎన్నో పథకాలను అమలు చేశారు. అలాగే స్థానికులకు 75శాతం ఉద్యోగాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం అవకాశం. ఇలా ఆరు నెలల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వీడియో రూపంలో పొందుపరిచారు.

వీడియోను పోస్ట్ చేసిన జగన్ ‘ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని.. రాష్ట్ర ప్రగతికి నేను వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నాను’అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.