యాప్నగరం

వైఎస్ వర్దంతి..ఏపీ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్

ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి 1460 కిలోమీటర్లు నడిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సమయంలో రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. అధికారంలోకి రాగానే వారికి అనేక వరాలను ప్రకటించారు.

Samayam Telugu 2 Sep 2019, 8:55 am
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందర్నీ శోక సంద్రంలో ముంచి, అనంతలోకాలు తరలిపోయి నేటికి సరిగ్గా పదేళ్లు. వైఎస్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆరోగ్య శ్రీతో పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దగ్గర చేస్తే, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు దన్నుగా నిలిచారు. దేశానికి వెన్నుముక అయిన రైతన్నలను ఆదుకోడానికి ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ పథకాలను తీసుకొచ్చారు. జలయజ్ఞం పేరుతో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
Samayam Telugu ysr


తన తండ్రి వర్దంతి సందర్భంగా జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రాష్ట్రాన్ని వైఎస్ నడిపిన తీరు జాతీయస్థాయిలో తెలుగువారిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా పథకాల రూపంలో బతికే ఉన్నారని భావోద్వేగానికి గురయ్యారు.

‘పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు మొత్తం దేశానికే మార్గదర్శకాలయ్యాయి. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసింది.నాన్న భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువలబాటలో నడిపిస్తూనే ఉంటుంది’ అని జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా పని చేయాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. పార్టీలకు అతీతంగా పథకాలను అందజేయాలని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.