యాప్నగరం

పేదవాడి సొంతింటి కల నిజమైన వేళ.. జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీకి శ్రీకారం

రాష్ట్రంలోని 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కానున్నాయి. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం కేటాయించింది. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది.

Samayam Telugu 25 Dec 2020, 2:42 pm
ఏపీలో ఏకాదశి, క్రిస్మస్ రోజు పేదవాడి సొంతింటి కల నిజమైంది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో శుక్రవారం ప్రారంభించారు.. అనంతరం పథకం ప్రారంభోత్సవానికి గుర్తుగా గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, వంగా గీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 15 రోజులపాటు పట్టాల పంపిణీ జరగనుంది.
Samayam Telugu సీఎం జగన్


రాష్ట్రంలోని 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కానున్నాయి. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం కేటాయించింది. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ ఇళ్ల కాలనీలకు జిల్లాల్లో పేదింటి పేటలు, కాలనీలను జగన్‌, జగనన్న పేరుతోనే సిద్ధం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.