యాప్నగరం

పుట్టినరోజు నాడు.. ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ను ప్రారంభించిన సీఎం

AP CM YS Jagan తన పుట్టిన రోజునాడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వాారా రాష్ట్రంలోని 81,783 చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తారు.

Samayam Telugu 21 Dec 2019, 2:45 pm
అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాల్ని చూశానన్న ఆయన.. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు. అకౌంట్లలో పడే డబ్బులను బకాయిలు కింద జమ చేసుకోకుండా.. బ్యాంకులకు ఆదేశాలిచ్చామని జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లు ఖర్చు జగన్ పుట్టిన రోజు నాడే ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషం.
Samayam Telugu Jagan Antp.


చేనేతలతో తన తండ్రి వైయస్సార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకే సీఎం జగన్ తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ ఎప్పుడూ చేనేత వస్త్రాలు ధరించేవారనే సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వం ఆప్కో సంస్థను లంచాల మయం చేసిందని జగన్ ఆరోపించారు. పచ్చచొక్కాలకు దోచిపెట్టేందుకు బాబు సర్కారు ఆప్కోను ఉపయోగించుకుందన్నారు. ఆప్కోలో జరిగిన అవినీతిపై దర్యాప్తును పూర్తి చేసి వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. నేతన్నలకు మరింత మంచి చేసే దిశగా అడుగులు వేస్తామని సీఎం జగన్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.