యాప్నగరం

అనాథలైన పిల్లలకు రూ. 10 లక్షలు.. కష్టకాలంలో సీఎం జగన్ గొప్ప మనసు

కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 17 May 2021, 10:52 pm
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మరి గడగడలాడిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సైతం మహమ్మారి వణికిస్తోంది. కరోనా భారిన పడి ఆస్పత్రల్లో చేరే పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. ఈ మహమ్మారి కాటుకు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్‌ కారణంగా ఒకేసారి తల్లిదండ్రులు చనిపోయిన సంఘటనలు కూడా ఇటీవల కాలంలో విరివిగా చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరనీ కరోనా కాటెయ్యడంతో చిన్న వయసులోనే పిల్లలు అనాథలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది.
Samayam Telugu వైఎస్ జగన్ సాయం


ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ఆశ్రయం కల్పించిన జగన్ సర్కారు.. తాజాగా, మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు సాయం చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కరోనా బారినపడి చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ మేరకు తదుపరి ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ. 10 లక్షలు డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా పిల్లలకు అందజేయనున్నట్లు సింఘాల్ వెల్లడించారు. వారికి 25 ఏళ్లు వచ్చే వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పిల్లలకు వారికి 25 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుందని తెలిపారు. దీని కోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.