యాప్నగరం

ఏపీలో కులాల రొచ్చు: పరువు బజారుకీడుస్తారా.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఏపీలో కులాల కలుపుమొక్కలు రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నాయని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 2 Nov 2020, 8:37 am
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. తర్వాత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu సీఎం జగన్ సీరియస్


తెలుగు నేలపై పుట్టిన కులాల కలుపు మొక్కలు రాష్ట్రం పరువును బజారుకీడుస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. కొందరు వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న విధానం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నావారు, కానివారు అనే భావనలు బాహటంగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణిని సమర్ధించవచ్చా అనేది ఆలోచించాలన్నారు.

Also Read: మంత్రి మేకపాటి పర్యటనలో రెచ్చిపోయిన దొంగలు.. పాపం, వైసీపీ కార్యకర్తలు..!

ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్‌మెంట్ తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారిందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఇలాగే కొనసాగనిద్దామా? అని ప్రశ్నించారు. తన వాడు గెలవలేదు.. తన వాడు పదవిలో, అధికారంలో లేరన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలనే ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్ల వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా అని నిలదీశారు. బయటవారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లతో దగా పడ్డామని చెప్పారు. సీఎం జగన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును, ఓ కులాన్ని సీఎం జగన్ టార్గెట్ చేసి మాట్లాడారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Must Read: వరలక్ష్మి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. అఖిల్ తండ్రిపై సీపీ సంచలన విషయాలు

Don't Miss: ఏపీలో మళ్లీ కరోనా పంజా: ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. నెల గ్యాప్‌లో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.