యాప్నగరం

ధోని రిటైర్మెంట్‌పై సీఎం జగన్ ట్వీట్

ధోని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ధోని దాదాపుగా 16 ఏళ్ల పాటు టీంఇండియాకు సేవలు చేశారు.

Samayam Telugu 16 Aug 2020, 8:45 am
టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసందే. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఆయన ఫాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్ళ పాటు టీం ఇండియాకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీం ఇండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. గత ఏడాది టీం ఇండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ ఎప్పుడు తప్పుకుంటారు అనే ప్రశ్నలు వినిపించాయి. తాజాగా ఎవరూ ఊహకు కూడా అందనట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేసి వెళ్ళిపోయాడు
Samayam Telugu సీఎం జగన్, ధోని
cm jagan, dhoni

Read More: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. 5 జిల్లాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలు
ఈ నేపథ్యంలో దోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు ధోని రిటైర్మెంట్ తో తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇకపై ధోనిని ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ లో ధోనికి అభినందనలు తెలిపారు. "నీ అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు ధోని. మీరు వదిలివేస్తున్న వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాబోయే తరాల క్రికెట్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.