యాప్నగరం

మహిళలకు సీఎం జగన్ శుభవార్త.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 15 వేలు.. వివరాలివే!

ఏపీలోని ఓసీ కులాల్లోని పేద మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 15 వేలు చొప్పున..!

Samayam Telugu 24 Jan 2022, 9:39 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఓసీ కులాలకు చెందిన మహిళల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Samayam Telugu మహిళలతో సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


రాష్ట్రంలోని 3.92 లక్షల మంది లబ్ధిదారులకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.589 కోట్లు వేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్‌ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు సాయం చేయనున్నారు.

45 సంవత్సరాల నుంచి 60 ఏళ్లలోపు పేద ఓసీ మహిళలు ఈ పథకానికి అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, ఇతర మహిళలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందించనుంది.

కాగా, ఇప్పటికే వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తూ వారికి జీవనోపాధికి సహకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని పేద మహిళలకు ఏటా రూ. 15,000 ఆర్ధిక సాయం చేస్తున్నట్లు వివరించింది.

ఇక, మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఓసీల్లోని ఇతర కులాలకు చెందిన పేద మహిళలకు వైఎస్సార్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15,000 అందివ్వడంతో, రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయస్సుగల పేద మహిళలందరికీ లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.