యాప్నగరం

ఇసుక కొరతపై జగన్ కీలక నిర్ణయాలు..

ఏపీలో ఇసుక కొరత ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. సమస్య తీవ్రం కావడంతో రంగంలోకి దిగిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లభ్యత పెరిగే వరకూ అధికారులు సెలవులు పెట్టొద్దన్నారు.

Samayam Telugu 12 Nov 2019, 5:02 pm
రాష్ట్రంలో ఇసుక కొరతను సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశారు జారీ చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరే వరకూ అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరకు ఇసుకను విక్రయించే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వరదల వల్ల రీచ్‌లు మునిగిపోవడంతో.. డిమాండ్‌కు సరిపడా ఇసుకను సరఫరా చేయలేకపోయామన్నారు.
Samayam Telugu jagan cm


గతంలో ఇసుక డిమాండ్‌ సగటున 80 వేల టన్నులు ఉండేదన్న సీఎం.. ప్రస్తుతం రీచ్‌ల సంఖ్య 60 నుంచి 90కి పెరిగిందన్నారు. వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడిందని.. ఇసుక లభ్యత పెరిగిందన్నారు. నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

మంగళవారం ఇసుక కొరతపై అధికారులతో సమీక్ష నిర్వహించి జగన్.. స్టాక్ పాయింట్లను 137 నుంచి 180 వరకూ పెంచాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా నవంబర్ 14లోగా రేటు కార్డును ప్రకటించాలన్నారు. పదిరోజుల్లోగా రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Read Also: నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలుకెళ్లారా?: జగన్‌కు పవన్ చురకలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.