యాప్నగరం

కర్నూలుకు సీఎం వైఎస్‌ జగన్‌.. తుంగభద్ర పుష్కరాలు, ప్రత్యేక పూజలు

కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప, ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు.

Samayam Telugu 20 Nov 2020, 10:01 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు. సంకల్‌భాగ్‌ ఘాట్‌లో పుష్కర పూజలు నిర్వహించనున్నారు. ఈ ఘాట్‌లోకి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప, ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు.
Samayam Telugu సీఎం జగన్


ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. 11.20కు 11.30కు ఓర్వకల్లుకు విమానంలో బయలు దేరుతారు. 12.30 ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టు చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు బయల్దేరతారు. 12.55కు ఏపీఎస్పీ బెటాలియన్‌ చేరుకుని.. 1 గంటకు రోడ్డు మార్గాన సంకల్‌భాగ్‌ పుష్కర్‌ ఘాట్‌కు బయల్దేరతారు. 1.10కి సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌కు చేరుకుంటారు. 01.10 నుంచి 01.50 గంటల వరకు పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి గన్నవరంకు బయల్దేరతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.