యాప్నగరం

ఢిల్లీ వెళ్తున్న సీఎం జగన్.. అమిత్ షాతో కీలక భేటీ?

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అక్టోబర్ 5న ఢిల్లీ వెళ్లొచ్చిన ఆయన మరోసారి దేశరాజధానికి వెళ్తున్నారు. అమిత్ షా, ఇతర మంత్రులతో ఆయ భేటీ కానున్నారు.

Samayam Telugu 20 Oct 2019, 6:29 pm
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం.. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారు. హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. విభజన సమస్యల పరిష్కారం, పోలవరం నిధులు తదితర అంశాలను ఆయన చర్చిస్తారని సమాచారం. సోమవారం రాత్రి సీఎం ఢిల్లీలోనే బస చేయనున్నారు.
Samayam Telugu jagan 2.


అమిత్ షాతో జగన్ భేటీ ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యింది. అక్టోబర్ రెండో వారంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సింది. అక్టోబర్ 12న అమిత్ షాతో అపాయిట్‌మెంట్ ఖరారైంది. కానీ అపాయింట్‌మెంట్ రద్దయినట్టు తర్వాత హోంమంత్రి కార్యాలయం తెలిపింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉండటంతోనే.. జగన్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్ రద్దయినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 14న ఆయన ఢిల్లీ వెళ్తారని వార్తలొచ్చాయి. కానీ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.

Read Also: రెండోసారి అమిత్ షా అపాయింట్‌మెంట్ రద్దు

అక్టోబరు 5న ఢిల్లీకి వెళ్లిన జగన్.. ఆ రోజు మోదీని కలిసినా, హోం మంత్రిని మాత్రం కలవలేకపోయారు. ఇక, ఆగస్టు 26న కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన జరిగిన అంతర్రాష్ట మండలి స్థాయీ సంఘం సమావేశంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షాతో ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.