యాప్నగరం

చంద్రబాబును అర్జెంట్‌గా పిచ్చాస్పత్రిలో చేర్చాలి, లేదంటే.. సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 1 Dec 2020, 7:01 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును అర్జెంట్‌గా పిచ్చాస్పత్రిలో చేర్పించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పూర్తిగా పిచ్చి పట్టిందని, ఆయన్ను అలాగే వదిలేస్తే రాష్ట్రానికి, ప్రజలకు కూడా హానికరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయనకు నరకంలో కూడా చోటు లభించదని దుయ్యబట్టారు.
Samayam Telugu జగన్ Vs చంద్రబాబు


తాను మాట చెప్తే చేసి చూపిస్తానని సీఎం జగన్ అన్నారు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుందని, మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలకు ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలోని 90 శాతం అంశాలను అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.

టిడ్కో ఇళ్లపై అంత క్లియర్‌కట్‌గా మేము చెబితే, చంద్రబాబునాయుడు ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని సీఎం జగన్ అన్నారు. తాను సరిగ్గా ఏది మాట్లాడానో అదే మేనిఫెస్టోలో పెట్టామని, అయినా ఈ మనిషి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తన మాటలను ఎక్కడికక్కడ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ఆయనకు బుర్ర ఏమైనా ఉందా? వాటీజ్‌ రాంగ్‌ విత్‌ దిస్‌ మ్యాన్ అంటూ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.