యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త: 753కి పడిపోయిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పడిపోయాయి. అలాగే సోమవారం కరోనా మరణాలు 13 నమోదయ్యాయి.

Samayam Telugu 16 Nov 2020, 6:23 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసుల విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇంత తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొట్టమొదటి. అయితే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గించడం వల్లే ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంలో ఏపీలో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయితే సోమవారం మాత్రం ఏకంగా వెయ్యి కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు వచ్చాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 43,044 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 753 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,54,764కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే కరోనా మరణాలు కూడా సోమవారం స్వల్పంగా తగ్గాయి. సోమవారం కరోనా మహమ్మారి బారిన పడి 13 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,881కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు కూడా భారీగా తగ్గాయి. సోమవారం 1,507 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,29,991 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 17,892 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 91,97,307 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.