యాప్నగరం

ఏపీలో భారీగా పడిపోయిన కరోనా మరణాలు.. స్వల్పంగా తగ్గిన కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గిపోయాయి. అలాగే కరోనా మరణాలు 31కి పడిపోయాయి.

Samayam Telugu 9 Oct 2020, 7:28 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పడిపోయాయి. అలాగే కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 70,521 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5,145 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,44,864కు చేరుకున్నాయి.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona nurses


అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా పడిపోయాయి. గురువారం కరోనా బారినపడి 42 మంది మరణించగా, శుక్రవారం ఆ సంఖ్య 31కి పడిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,159కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే గత డిశ్చార్జిలు కూడా రాష్ట్రంలో స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 6,110 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,44,864 పాజిటివ్ కేసులకు గాను, 6,91,040 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 47,665 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు యథావిధిగా పెరిగిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు లక్ష దాటగా, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో సైతం గత కొన్ని రోజుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.