యాప్నగరం

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ జిల్లా ప్రజలకు మాత్రం బిగ్ రిలీఫ్!

ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అలాగే ఒక్క కరోనా మరణం నమోదైంది.

Samayam Telugu 17 Jan 2021, 4:42 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరగగా, మళ్లీ ఒక్క మరణం సంభవించింది. అయితే కడప జిల్లా ప్రజలకు మాత్రం కరోనా విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆదివారం కడప జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇక, రాష్ట్రంలో శనివారం కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, ఆదివారం ఒక్కరు మృతి చెందారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచగా, కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 36,091 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,85,985కి చేరింది.
Samayam Telugu కరోనా ఆస్పత్రి
corona hospital


అలాగే, రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం నమోదైంది. విశాఖపట్నంలో కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,140కి చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పడిపోయింది. కరోనా మహమ్మారి బారి నుంచి ఆదివారం మొత్తం 251 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,76,949 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,896కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,76,272 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఆదివారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 52 కరోనా కేసులు నమోదు కాగా, వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్క కేసు కూడా రాలేదు. కరోనా కేసులు వ్యాప్తి చెందినప్పటి నుంచి కడపలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇక, విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 35 ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.