యాప్నగరం

ఉద్యోగులూ.. మీ అకౌంట్లలోకి జీతాలు వచ్చాయ్, చూస్కోండి.. ఎవరికైనా తగ్గితే.. సీఎస్ కామెంట్స్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జీతాల డబ్బులు పడ్డాయని రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఎవరికీ జీతాలు తగ్గలేదంటూ..!

Samayam Telugu 1 Feb 2022, 7:22 pm
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు ఎవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. మంగళవారం రాత్రి వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామన్నారు. ఎవరికైనా మంగళవారం జీతాలు రాకపోతే, బుధవారం జమ చేస్తామని వెల్లడించారు.
Samayam Telugu సీఎం జగన్


ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చిస్తోందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని కోరారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని.. ఉద్యోగులతో ఓపెన్‌ మైండ్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీఎస్‌ తెలిపారు.

అలాగే, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యగలరో అన్నీ చేస్తారని సీఎస్ సమీర్‌ శర్మ అన్నారు. ఐఆర్‌ ఉన్నా, లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుందన్నారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తే ఎక్కువ పెరుగుదల ఉందన్నారు. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉందని.. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదని వివరించారు. ఈ విషయం అందరి అకౌంట్లలోకి జీతాలు వచ్చాక తెలుస్తుందన్నారు.

అలాగే, ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎస్ కోరారు. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్‌ స్కీం వల్ల అదనపు ప్రయోజనం ఉందన్నారు. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుందని.. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామన్నారు. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి.. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నానని సీఎస్‌ సమీర్‌ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.