యాప్నగరం

ఏపీ డిప్యూటీ సీఎం పెద్ద మనసు.. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి!

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. క్యూ లైన్‌లో ఇబ్బందిపడుతున్న అంధ భక్తుడు. వెంటనే తన వెంట దర్శనానికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం.

Samayam Telugu 8 Oct 2019, 9:26 pm
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఓ సామాన్యుడి కోసం ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మరీ అందరితో శభాష్ అనిపించుకున్నారు. దసరా కావడంతో.. నారాయణ స్వామి మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. ఈలోపే సామాన్య భక్తులు కూడా పక్కనే క్యూ లైన్‌లో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
Samayam Telugu swamy


భక్తుల్లో ఓ అంధ వ్యక్తి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అప్పటికే ఐదు గంటల పాటు క్యూలైన్‌లో వేచి ఉన్నారట. అతడి ఇబ్బందిని గమనించిన డిప్యూటీ సీఎం.. వెంటనే తన సిబ్బంది పంపించి అతడ్ని తన వెంట దర్శనానికి తీసుకెళ్లారు. అమ్మవారి దర్శనం తర్వాత మళ్లీ బయటకు పంపించే వరకు సిబ్బందికి చెప్పి జాగ్రత్త తీసుకున్నారు.

ఆ భక్తుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. భవానీ మాల ధరించి విరమించేందుకు దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. నారాయణ స్వామి తన పోట్రోకాల్‌ను కూడా పక్కన పెట్టి పెద్ద మనసుతో సామాన్య భక్తుడిని తనతో పాటూ తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నారు. డిప్యూటీ సీఎంపై భక్తులతో పాటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.