యాప్నగరం

ఏపీ డిప్యూటీ సీఎం దంపతుల వంటా-వార్పు.. పేదల ఆకలి తీర్చడం కోసం!

పుష్పశ్రీవాణి తన సొంత నియోజకవర్గం కురుపాంలో పేదల ఆకలి తీరుస్తున్నారు. కొద్ది రోజులుగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్పశ్రీవాణి తన భర్తతో కలిసి స్వయంగా వంట చేస్తున్నారు.

Samayam Telugu 18 Apr 2020, 10:10 am
కరోనా, లాక్‌‌డౌన్ వేళ పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. కొందరు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తుంటే.. మరికొందరు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటూ కొంతమంది స్థానికులు, రాజకీయ నేతలు ఇలా కష్టకాలంలో మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. అదేబాటలో నడుస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి దంపతులు.
Samayam Telugu pushpa


పుష్పశ్రీవాణి తన సొంత నియోజకవర్గం కురుపాంలో పేదల ఆకలి తీరుస్తున్నారు. కొద్ది రోజులుగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్పశ్రీవాణి తన భర్తతో కలిసి స్వయంగా వంట చేస్తున్నారు. కూరగాయలు తరిగి వంటలు సిద్ధం చేస్తున్నారు. ఫుడ్‌ని పార్శిల్స్ చేసి పేదలకు అందిస్తున్నారు. ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్ధితులలో నియోజకవర్గంలో రోజూ పేదవారికి ఆహారం తయారుచేసి పంపిస్తున్నామని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదవారికి మీ వంతుగా సహాయం చేయాలని పుష్పశ్రీవాణి పిలుపు ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.