యాప్నగరం

దిశ ఎఫెక్ట్: సూపర్ ఫాస్ట్‌గా ఫోరెన్సిక్ నివేదికలు.. ఏపీలో మరో రెండు ల్యాబ్‌లు.!

మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో కీలకంగా మారుతున్న ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు. దిశ చట్టం ఎఫెక్ట్‌తో విజయవాడ సహా మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు నెలకొల్పే దిశగా అడుగులేస్తున్నారు.

Samayam Telugu 17 Dec 2019, 11:32 pm
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నేపథ్యంలో జగన్ సర్కార్ మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు దిశ పేరుతో కీలక చట్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడంతోపాటు అవగాహన పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీలతో సమావేశమయ్యారు.
Samayam Telugu police.


దిశ చట్టం అమలుకు ఎస్పీలు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన వర్క్ షాప్‌లో ఏపీ డీజీపీ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దిశ చట్టం అమలుకు చర్యలు.. కేసు నమోదు మొదలుకుని దర్యాప్తు పూర్తి చేసే వరకు రెవెన్యూ, మెడికల్, ఫోరెన్సిక్, మహిళా శిశు సంక్షేమ శాఖలతో సమన్వయం.. నిర్ణీత సమయంలో నిందితులకు శిక్ష పడేందుకు తీసుకోవాల్సన చర్యలపై ఎస్పీలతో చర్చించారు.

Read Also: భార్య, కోడలితో వ్యభిచారం చేయించైనా.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ లెటర్

మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే ఈ చట్టం ఉద్దేశమని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. కేసును వేంగంగా దర్యాప్తు జరపడంతో పాటు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని.. సాధ్యమైనంత త్వరగా ఫోరెన్సిక్ నివేదికలు , DNA రిపోర్ట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలో వయస్సు నిర్ధారణ , పోస్టుమార్టం, అన్ని రకాల వైద్య నివేదికలు వచ్చేలా చొరవ తీసుకోవాలని డీజీపీ సూచించారు.

అలాగే కేసుల విచారణను వేగవంతం చేయడంలో భాగంగా మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. త్వరలోనే ‌విజయవాడతో పాటు విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ ను మరింత పటిష్ట పరుస్తామని ఆయన చెప్పారు. అలాగే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో స్పెషల్ కోర్టుల ఏర్పాటుపై చర్చించారు.

Also Read: నెల్లూరులో కీచక డాక్టర్.. కోరిక తీర్చాలంటూ వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.