యాప్నగరం

Chandrababu Naidu కాన్వాయ్‌పై దాడి.. ఇద్దరి అరెస్ట్.. డీజీపీ రియాక్షన్

అమరావతి పర్యటన సమయంలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటన. స్పందించిన ఏపీ డీజీపీ .. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన గౌతమ్ సవాంగ్.. ఇద్దరిలో ఒకరు రైతు, మరొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి.

Samayam Telugu 28 Nov 2019, 4:04 pm
అమరావతిలో పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి, ఉద్రిక్తతలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. బాబు కాన్వాయ్‌పై చెప్పులతో, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు రైతు కాగా.. మరొకరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వ్యక్తిగా గుర్తించామంటున్నారు పోలీసులు. చంద్రబాబు తీరుతో తమనకు అన్యాయం జరిగిందనే కోపంతో ఇలా చేశామని ఒప్పుకున్నట్లు తెలిపారు.
Samayam Telugu dgp.


Read Also: 'మేమూ అలా చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవారా'

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందన్నారు. పొలిటికల్ కామెంట్లపై తాము స్పందించమని.. చంద్రబాబు పర్యటనతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఇబ్బందులు ఉండవని.. తమ విచారణలో తేలడంతోనే పర్యటనకు అనుమతి ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని.. పోలీసులు పరిస్థితి కొద్దిసేపటిలోనే అదుపులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Also Read: అమరావతిలో బాబు పర్యటన.. హైవోల్టేజ్ నిరసనలు.. ఈస్థాయిలో వ్యతిరేకత ఎందుకు?

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా పెంచామంటున్నారు డీజీపీ. సీఐడీ ఆధర్వ్యంలో ప్రత్యేకంగా ప్రణాళిక చేపట్టామని తెలిపారు. ఓ వాట్సాప్ నెంబర్‌ (7382296118 ) డీజీపీ ప్రారంభించారు. స్మగ్లింగ్‌పై నేరుగా వాట్సాప్ ద్వారా నార్కోటిక్ సెల్, సీఐడీకి సమాచారం అందజేయొచ్చు. అంతేకాదు ఇలా సమాచారం ఇచ్చేవారికి పారితోషకం కూడా ఇస్తారు.. వారి వివరాలు రహస్యంగా ఉంచుతారు. ప్రజల సహకారంతో దీనికి చెక్ పెడతామని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.