యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ జీవోలపై సుప్రీంకోర్టుకు!

హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి.. న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. హైకోర్టు తీర్పును గెలుపు, ఓటమిగా చూడకూడదi.. కోర్టు తీర్పుపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు.

Samayam Telugu 16 Apr 2020, 7:28 am
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. పేదలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి.. న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.
Samayam Telugu c


Read Also: తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే.. ఏపీ సీ'ఐ'డీ

హైకోర్టు తీర్పును గెలుపు, ఓటమిగా చూడకూడదని.. కోర్టు తీర్పుపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు. ఇంగ్లీష్ మీడియం విషయాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని.. ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూనే.. తెలుగు మీడియంను కూడా కొనసాగిస్తామని చెప్పినా.. ఎందుకు ఇలా అయ్యిందో అర్ధం కావడంలేదన్నారు మంత్రి. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ అది ప్రతిపక్షాల ఆలోచన విధానమని.. బడగుబలహీన వర్గాల చెంపమీద కొట్టినట్లు ఉందన్నారు.

Also Read: నాపై తప్పుడు ప్రచారం.. ఆ కార్లు నావి కాదు: వైసీపీ ఎమ్మెల్యే

బడుగు, బలహీనవర్గాల వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదని టీడీపీ కోరుకుంటోందన్నారు మంత్రి సురేష్. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని.. దీనికి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తీసుకున్న చర్యలన్నింటినీ కోర్టుకు నివేదించాంమన్నారు. పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలనేది తల్లిదండ్రుల ఇష్టమని.. తెలుగులోనే చదువుకుంటామనే వారి కోసం ప్రతీ మండలంలోనూ ఒక పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.