యాప్నగరం

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో మెగా డీఎస్సీ.. అసెంబ్లీలో మంత్రి ప్రకటన

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 7.900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. గతంలోనే ప్రతి ఏటా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న సీఎం జగన్.

Samayam Telugu 9 Dec 2019, 11:45 am
ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 7900 పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu suresh


Read Also: అసెంబ్లీకి వచ్చిన వల్లభనేని వంశీ.. టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి మాట్లాడగా..

ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని.. వచ్చే జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు చెప్పినట్లుగానే మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు.

ఇటు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్‌వాడీ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా శుభవార్త అందిస్తోంది. తాజాగా మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగులు ఆనందంతో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.