యాప్నగరం

ఏపీ రాజధాని విశాఖ అయితే.. మాజీ సీఎస్ ఐవైఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ముంబై వంటి నగరాల స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే రెండు మూడు తరాల వరకు అవకాశమే లేదని మాజీ సీఎస్ ఐవైఆర్ స్పష్టం చేశారు.

Samayam Telugu 22 Dec 2019, 9:57 pm
ఏపీ రాజధానిపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతి సరికాదని గతంలోనే చెప్పానన్న ఐవైఆర్.. విశాఖ సరైన ప్రదేశమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుమించిన ప్రదేశం మరొకటి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu iyr


అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గానే కాకుండా లెజిస్లేచర్ క్యాపిటల్‌గా కూడా ఉంటే బాగుంటుందని ఆయన సూచించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

Also Read: రాజస్థాన్ ఎడారిలా రాజధాని.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ముంబై వంటి నగరాల స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే రెండు మూడు తరాల వరకు అవకాశమే లేదని ఐవైఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందాలంటే వందేళ్ల పడుతుందని ఆయన అన్నారు. అలా చూస్తే విశాఖనే కరెక్ట్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.