యాప్నగరం

ఏపీ మంత్రికి ముప్పు.. బుల్లెట్‌ప్రూఫ్ వాహనం కేటాయింపు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఏపీ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది.

Samayam Telugu 4 Sep 2020, 4:32 pm
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కేటాయించింది. భద్రతా కారణాల రీత్యా ఇంటెలిజెన్స్‌ నివేదిక మేరకు మంత్రి కన్నబాబుకు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించేందుకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 10 రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక ఇచ్చాయి.
Samayam Telugu మంత్రి కన్నబాబు బుల్లెట్ ప్రూఫ్ వాహనం


మంత్రి కన్నబాబు ఎక్కువగా ప్రజలతో మమేకం కావడం, సాధారణ వాహనంపై తిరుగుతుండటంతో ఆయన భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దీంతో భద్రతా కారణాల రీత్యా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి తమకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి. ఈ విషయంలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.