యాప్నగరం

ఏపీలో పేదలకు శుభవార్త.. రేషన్ షాపుల్లో కొత్తగా మరో రెండు వస్తువులు పంపిణీ

Ap Govt To Distribute Jowar Ragi పంపిణీ చేయనుంది. UNO 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం వీటిని ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తోంది. అందుకే రేషన్‌ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయాలని భావిస్తున్నారు. పౌర సరఫరాలశాఖ రాష్ట్రంలో జిల్లాల వారీ విస్తీర్ణం, దిగుబడి ఎంత.. ఎంత సేకరించాలనే వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. చిరు ధాన్యాలతో వినియోగంతో ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కార్డులున్న పేద కుటుంబాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 Jan 2023, 5:48 am

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • రేషన్ షాపుల్లో చిరు ధాన్యాలు
  • సర్వే చేయిస్తున్న అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ap Ration Shop Millets Distribution
ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న చౌక బియ్యానికి బదులు.. పేదలకు చిరుధాన్యాలను అందించాలని భావిస్తోంది. ఇప్పుడు ఆ దిశగా ఫోకస్ పెట్టింది. మూడేళ్ల క్రితం నిలిపేసిన జొన్నలు, రాగుల పంపిణీ మళ్లీ ప్రారంభించాలి అనుకుంటోంది. UNO 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం చిరు ధాన్యాలను ప్రోత్సహించే దిశగా కసరత్తు చేస్తోంది. రేషన్‌ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయాలని రాష్ట్రాలకు సూచనలు చేశారు.
అందుకే పౌర సరఫరాలశాఖ రాష్ట్రంలో జిల్లాల వారీ విస్తీర్ణం, దిగుబడి ఎంత.. ఎంత సేకరించాలనే వంటి వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం రేషన్‌ కార్డుదారుల్లో ఎన్ని కుటుంబాలు వీటిని తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు.. అలాగే డిమాండ్‌ ఎంత అనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ఒక్కో రేషన్‌ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని భావిస్తోంది. ఈ చిరు ధాన్యాలతో వినియోగంతో ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కార్డులున్న పేద కుటుంబాలకు కరపత్రాలు పంపిణీ చేస్తోంది.

ఇకపై కార్డుపై ప్రస్తుతం తీసుకుంటున్న బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా అంగీకరిస్తారా అని పత్రాలపై వారితో సంతకాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం అమలుచేయాలని కమిషనర్‌ ఆదేశించారు. కార్డుదారులకు చిరుధాన్యాల పంపిణీపై సర్వే జరుగుతోందని.. ఈ వారంలో ఇది పూర్తవుతుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ తెలిపారు. మొత్తం మీద పేదలకు చిరు ధాన్యాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.