యాప్నగరం

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్

Ap Ration Shops కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా 16 మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్డుదారులకు పంపిణీ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయలసీమలో పంపిణీ ప్రారంభించి.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సర్వే కూడా నిర్వహించగా.. చాలామంది ఆసక్తి చూపించారని అధికారులు తెలియజేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 24 Jan 2023, 7:13 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త
  • కొత్త నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
  • 16 మున్సిపాలిటీల్లో మాత్రమే అమలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Wheat Flour In Ap Ration Shops
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మొత్తం 16 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సుమారు 7 లక్షల బియ్యం కార్డుదారులకు ఫిబ్రవరి నుంచి రాయితీపై గోధుమపిండి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో రేషన్ కార్డుపై నెలకు 2 కిలోల గోధుమపిండిని.. కిలో రూ.16 చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్డుదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు త్వరలో రాగులు, జొన్నలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్‌కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యంలో 2 కేజీలు తగ్గించి.. వాటి స్థానంలో రాగులు, జొన్నలను రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించగా, ఎక్కువ మంది రాగులు, జొన్నలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో రాయలసీమ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పంపిణీ మొదలుపెట్టనున్నారు. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామని ఇటీవలే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. అలాగే కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని.. బండి దగ్గరే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.