యాప్నగరం

ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు ఆగస్టు 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘాలను గ్రామస్థాయి కమిటీలు గుర్తిస్తాయి. మిగిలిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

Samayam Telugu 1 Aug 2020, 9:08 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ పనిముట్ల విలువలో 10 శాతం నిధులను సంఘాలు సమకూర్చుకుంటే.. బ్యాంకులు 50 శాతం రుణాన్ని ఇస్తాయి. మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకు ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
Samayam Telugu వైఎస్ జగన్


రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు ఆగస్టు 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘాలను గ్రామస్థాయి కమిటీలు గుర్తిస్తాయి.. ఇక వ్యవసాయ పరికరాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణం ఎగవేసి ఉండకూడదు. కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు, గరిష్టంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్లను ఆప్కాబ్‌ రుణంగా మంజూరు చేస్తారు. గ్రూపులకు పరికరాలను సరఫరా చేసిన తరువాతనే, ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాలను ప్రభుత్వం జమ చేస్తుంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఒక గ్రామంలో ఒక సంఘానికే మాత్రమే రాయితీపై రుణం అందించనున్నారు. అలాగే యాంత్రిక పరికరాలను రాయితీపై పొందిన గ్రూపులు.. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకు ఇచ్చుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.