యాప్నగరం

ఏపీలో పీఆర్సీ రగడ, ఉద్యమం ఉధృతం.. ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..

Samayam Telugu 25 Jan 2022, 12:36 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి. పీఆర్సీకీ వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చాయి. మంగళవారం ఉదయం నుంచి ఆందోళనలు ప్రారంభించాయి.
Samayam Telugu విజయవాడలో ఉద్యోగ సంఘాల ధర్నా


పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు. విజయవాడలో పాతబస్టాండ్‌ నుంచి గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వరకు ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి పోలీస్ కమిషనరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా అనంతపురంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పలుచోట్ల అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.