యాప్నగరం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు జగన్ సర్కార్ ట్విస్ట్.. ఆల్ పార్టీ మీట్‌కు ముందు కీలక పరిణామం

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహఇంచేందుకు సిద్ధమవుతున్న వేళ జగన్ సర్కార్ మరో షాకిచ్చింది.

Samayam Telugu 28 Oct 2020, 7:19 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేమంటోంది.. దీంతో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ఇక ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహఇంచేందుకు సిద్ధమవుతున్న వేళ జగన్ సర్కార్ మరో ట్విస్ట్ ఇచ్చింది.
Samayam Telugu నిమ్మగడ్డకు ట్విస్ట్


ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశ నిర్వహణను నిలిపివేయాలని ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో ప్రస్తావించింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు భిన్నంగా జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న సమావేశాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును కోరింది.. దీనిపై కోర్టు విచారణ జరపనుంది.

ఇదిలా ఉంటే ఎస్‌ఈసీ నిర్వహించే సమావేశానికి హాజరుకాకూడదని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుంది. ముందు ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలన్నారు. ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండా భేటీ ఏర్పాటు సరికాదన్నారు. ఎస్‌ఈసీకీ ఆరు ప్రశ్నల్ని అంబటి సంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.