యాప్నగరం

దమ్మాలపాటిపై కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటిషన్

ఎఫ్ఐఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని.. ఎఫ్‌ఐఆర్‌పై పిటిషనర్ ప్రశ్నించనప్పటికీ వాటిపై సైతం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో తెలిపింది.

Samayam Telugu 22 Sep 2020, 6:22 am
అమరావతి భూముల వ్యవహారంకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని పిటిషన్‌లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను లేకుండా చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో ప్రస్తావించింది.
Samayam Telugu సుప్రీంకోర్టు


ఎఫ్ఐఆర్‌ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని.. ఎఫ్‌ఐఆర్‌పై పిటిషనర్ ప్రశ్నించనప్పటికీ వాటిపై సైతం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం రిలీఫ్ ఇచ్చారని.. అమరావతిలో భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం జరిగిందని ప్రస్తావించింది. కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో తెలిపింది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మీడియాపై విధించిన నిషేధాజ్ఞలను కూడా ఎత్తివేయాలని కోరారు.

ఈ కేసు రాజధాని భూములకు సంబంధించిందని, మాజీ ఏజీ తన అధికారాన్ని దుర్వియోగం చేసి భూములు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయని పిటిషన్‌‌లో ప్రస్తావించింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని మాజీ ఏజీ హైకోర్టుకు నివేదించారని.. కానీ అది నిజం కాదని తెలిపారు. 15న ఉదయం 9 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని.. అదే రోజు సాయంత్రం హైకోర్టు దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.