యాప్నగరం

ఏపీలో భూముల రేట్లు పెంపు.. పట్టణాల్లో పెరిగిన ధరలివే..!

ఏపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Samayam Telugu 10 Aug 2020, 10:51 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ రేట్లు అమల్లోకి వచ్చాయి. మార్కెట్‌ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో వెబ్‌సైట్‌ ద్వారా రెవెన్యూశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 శాతం, విశాఖపట్నంలో 25 శాతం, అనంతపురంలో 30 శాతం మేర ధరలను పెంచింది.
Samayam Telugu ఏపీలో భూముల ధరలు పెంపు


అయితే రిజిస్ట్రేషన్‌ చార్జీలు మాత్రం స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన భూముల ధరలతో ఖజానాకు రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోని వ్యత్యాసాల పరిశీలనకు ఓ కమిటీని నియమించింది.

ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఈ కమిటీ పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలను నిర్ణయించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ సోమవారం ప్రకటన విడుదల చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.