యాప్నగరం

YS Jagan: తల్లిదండ్రులకు శుభవార్త.. కాలేజీలకు జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

YS Jagan Mohan Reddy: పాఠశాలలు, కళాశాలలు తెరవబోతున్న తరుణంలో ట్యూషన్ ఫీజుపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 30 Oct 2020, 10:48 pm
కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రారంభం కాబోతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30 శాతం తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu ఏపీ విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త


కోవిడ్‌ కారణంగా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ఈ తరుణంలో విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా, రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. 2 నుంచి 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్‌కు క్లాస్‌లు ప్రారంభం కాబోతున్నాయి. నవంబర్ 23 నుంచి 6, 7, 8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.