యాప్నగరం

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై ఇద్దరు డిప్యూటీలు, త్వరలో గవర్నర్ ఆర్డినెన్స్

త్వరలోనే దీనికి సంబంధించి ఆర్డినెన్సును గవర్నర్‌కు పంపిస్తామన్నారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపిన తర్వాత డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్‌ల ఎన్నికకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

Samayam Telugu 17 Mar 2021, 7:11 am

ప్రధానాంశాలు:

  • ఇద్దరు డిప్యూటీలు ఉండాలంటున్న జగన్ సర్కార్
  • త్వరలోనే గవర్నర్ ఆర్డినెన్స్ తెస్తామన్న మంత్రి
  • ఆర్డినెన్స్ రాగానే మరోసారి నోటిఫికేషన్ జారీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీఎం జగన్
జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్లు ఉండాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీనికి సంబంధించి ఆర్డినెన్సును గవర్నర్‌కు పంపిస్తామన్నారు. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 18న మేయర్‌, ఉప మేయర్‌, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుందని.. ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపిన తర్వాత డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్‌ల ఎన్నికకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
ఎక్కువ మందికి ప్రభుత్వ సేవలు అందించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన దశ నుంచి ప్రారంభిస్తే ఆరు రోజుల్లోనే పూర్తి చేయొచ్చని పెద్దిరెడ్డి అన్నారు. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ ఈ ఎన్నికలు కూడా నిర్వహించి పదవీ విరమణ చేయాలని కోరుతున్నామన్నారు. ముందుగా జరపాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కనపెట్టి పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.