యాప్నగరం

గంధం చంద్రుడు సహా పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. ఏయే శాఖలకు ఎవరంటే!

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారులు..!

Samayam Telugu 25 Jan 2022, 5:03 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి సీఎస్ జీవో జారీ చేశారు. ప్రముఖ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడును సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా గంధం చంద్రుడు ఉన్నారు.
Samayam Telugu గంధం చంద్రుడు


అలాగే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న రేఖారాణిని కాపు కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్‌ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్‌ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు.

ఇక, ఏపీ భవన్‌ ప్రత్యేక అధికారి ఎన్‌వీ రమణారెడ్డిని ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవోగా నియమిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ భవన్‌ ప్రత్యేక అధికారిగా అక్కడ అదనపు కమిషనర్‌గా ఉన్న హిమాన్షు కౌశిక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈఓగా ఉన్న ఆర్‌. పవన్‌మూర్తిని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.