యాప్నగరం

కాపు ఉద్యమ కేసులు ఉపసంహరణ.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా తుని రైలు ఘటనలో 17 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Samayam Telugu 27 Jul 2020, 11:44 pm
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో గత తెలుగు దేశం పార్టీ హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమంలో భాగంగా 2016 జనవరిలో నిర్వహించిన తుని కార్యక్రమంలో పలువురు ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరో 17 కేసులల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu కాపు ఉద్యమ కేసులు ఉపసంహరణ


తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. రైలును తగులబెట్టిన ఘటనకు సంబంధించి మొత్తం 69 కేసులు నమోదు కాగా, ఇప్పటికే 51 కేసులను గతేడాది వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కులస్తులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. గత ఎన్నికల సమయంలో ఆ ఘటనకు సంబంధించి కేసులను మాఫీ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మొత్తం కేసులను ఉపసంహరించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.