యాప్నగరం

ఏపీ సచివాలయ, అసెంబ్లీ, మిగిలిన ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్

సచివాలయం, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పొడిగింపు. 01-08-2020నుంచి 31-07-2021 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు.

Samayam Telugu 26 Aug 2020, 6:41 am
ఏపీ సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వచ్చి.. సచివాలయం, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 750మందికి ఉచిత వసతి సదుపాయం మరో ఏడాది పొడిగించారు. 01-08-2020నుంచి 31-07-2021 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడాది పాటూ ఉద్యోగులకు ఉచిత వసతి కల్పించారు.. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Samayam Telugu సీఎం జగన్


అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి పని దినాలను 5 రోజులుగా ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి ఇది కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. రెండు నెలల క్రితమే దీన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను వచ్చే ఏడాది వరకు పొడిగించారు. అంటే వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారు.. వారికి శని, ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటించారు. ఇది రాజధాని అమరావతి పరిధిలో సచివాలయ ఉద్యోగులు, అన్ని శాఖల హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులకు వర్తిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.