యాప్నగరం

ఆశా వర్కర్లు, వాలంటీర్లలకు సీఎం జగన్ శుభవార్త

కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. కరోనాపై పోరులో ముందువరుసలో పనిచేస్తున్న వారందరినీ తీసుకురావాలని అధికారుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆదేశించారు.

Samayam Telugu 20 Apr 2020, 6:54 am
ఆశా వర్కర్లు, వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. కరోనా బీమా పరిధిలోకి వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు సహా ముందువరుసలో పనిచేస్తున్న వారందరినీ తీసుకురావాలని అధికారుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యల్లో సేవలు అందిస్తున్నారని.. వారికి అండగా, భరోసా నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
Samayam Telugu ap govt decided to implement insurance for asha workers and grama sachivalayam employees volunteers
ఆశా వర్కర్లు, వాలంటీర్లలకు సీఎం జగన్ శుభవార్త


Read Also: డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ తీపి కబురు

ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ బావుండాలన్నారు సీఎం జగన్. రెండు, మూడు రోజుల కోసారి స్పెషల్ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. రెడ్‌జోన్లలో ర్యాండమ్‌, కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన వారిని పరీక్షిస్తామని అధికారులు వివరించగా.. కుటుంబ సర్వేలో గుర్తించిన 32 వేల మందినీ పరీక్షిస్తే ఒక అవగాహన వస్తుందన్నారు.. దీనిపై దృష్టి సారించాలన్నారు జగన్. ఇక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు సీఎం. రాబోయే రోజుల్లో పరీక్షల సంఖ్య పెరుగుతుందన్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని.. వారం, పది రోజుల్లో రోజుకు 11500 పరీక్షలు చేయగలమన్నారు. కరోనాతో పాటు విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకూ పోరాడాలని సీఎం వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.